ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

0
1005395556

జమ్మికుంట, ఏప్రిల్ 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, జమ్మికుంట పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.16వ వార్డు నివాసితులైన పల్లపు ఉమ – రమేష్ దంపతులు నిర్మించుకున్న నూతన గృహాన్ని సందర్శించిన చైర్మన్, వారికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు పలువురు నాయకులు నస్రత్ పాషా (మున్సిపల్ ఏఈ)కోలుగురి కుమారస్వామి,జక్కే ప్రేమ్ , వార్డు ప్రముఖులు, కుటుంబ సభ్యులు,పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed