తెలంగాణ · September 7, 2026

కేటీఆర్, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆగ్రహం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 07: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్‌ఎస్ పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా వారిపై చేయి చేసుకోవడం, దురుసుగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించే క్రమంలో జుట్టు పట్టుకుని లాగడం, అసెంబ్లీలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని అడ్డుకుని చీర లాగి అవమానించడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ ముందే కంటతడి పెట్టుకున్నారని తెలిపారు.అంతేకాకుండా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, యాదవ రెడ్డి తదితరులపై కూడా పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడానికి వస్తున్న ప్రజాప్రతినిధుల పట్ల ఇంత క్రూరంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పేర్కొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor