తెలంగాణ · September 12, 2026

గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్/వి90న్యూస్,సెప్టెంబర్ 12: హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం సమన్వయంతో పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు.ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాలను పునరుద్ధరించామని, నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిర్వాహకులు దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని పొందాలని కోరారు. అలాగే గణేశ్ నిమజ్జనాలు, ఉత్సవాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల సహకారం అవసరమని, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిమజ్జన ప్రక్రియ కోసం చెరువుల వద్ద క్రేన్ల ఏర్పాటుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మండపాల ఏర్పాటు వివరాలు ముందుగా అందిస్తే ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణ సులభమవుతుందని సిఎం తెలిపారు. మండపాలకు వచ్చే అతిథుల వివరాలను స్థానిక కమిషనరేట్‌కు తెలియజేయాలని, దీనివల్ల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు , గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor