క్రైమ్ · September 12, 2026

1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ మోజులో పడుతున్నారా? తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచలన హెచ్చరిక!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 12: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. సాధారణ ఫొటోలను పాతకాలపు రెట్రో స్టైల్‌లోకి ఉచితంగా లేదా అపరిమితంగా మార్చి ఇస్తామంటూ సోషల్ మీడియా ప్రకటనలు, సందేశాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ తరహా ఉచ్చులో పడి అనుమానాస్పద లింకులను క్లిక్ చేస్తే తీవ్ర ప్రమాదం తప్పదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోషల్ మీడియా వినియోగదారులను అప్రమత్తం చేశారు.ఇలాంటి లింకుల ద్వారా మొబైల్ ఫోన్లలోకి ఏపీకే (APK) ఫైళ్లను పంపి, బాధితుల ఎస్ఎంఎస్‌లు, ఓటీపీలు, కాంటాక్టులు, బ్యాంకింగ్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సున్నితమైన సమాచారం ద్వారా అనధికారిక ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఎస్ఎంఎస్, వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్ 8712672222 లేదా cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor