ఎస్ఐ సతీష్‌కు జమ్మికుంట యువత ఘన వీడ్కోలు: సేవా నిరతికి నీరాజనం

0
IMG-20260510-WA0014

జమ్మికుంట, వి90 న్యూస్, మే 10: జమ్మికుంట ఎస్ఐగా పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకున్న సతీష్‌ను పట్టణ యువత ఘనంగా సన్మానించింది. విధి నిర్వహణలో నిబద్ధతను చాటుతూ, ప్రజలకు చేరువైన ఆయన ఇటీవల సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం జమ్మికుంట యువత ప్రత్యేకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో వీడ్కోలు పలికారు.జమ్మికుంటలో ఎస్ఐగా ఉన్న కాలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక అంశాల్లోనూ సతీష్ చురుగ్గా ఉండేవారని, ముఖ్యంగా యువతకు ఆయన నిరంతరం స్ఫూర్తినిచ్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, యువతతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు మరువలేనివని కొనియాడారు. కొత్త ప్రాంతంలోనూ ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాతకాల ప్రవీణ్, సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, రాజకుమార్, అంబాలా అరుణ్, నాగరాజు, వెంకటేష్, ప్రకాష్ రాజ్, సంతోష్, అభినయ్ తదితరులు పాల్గొని తమ కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed