భక్తిశ్రద్ధలతో శ్రీ అభయాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు

0
IMG-20260512-WA0014

జమ్మికుంట,వి90 న్యూస్ మే 12: జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధిలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు డింగరి హరికృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష హోమ కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకం సమర్పించారు.జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామిని అత్యంత సుందరంగా, భక్తిభావం ఉట్టిపడేలా అలంకరించారు. ఈ శుభవేళ ఆలయ ప్రాంగణమంతా భక్తులు ఆలపించిన హనుమాన్ చాలీసా, రామనామ స్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించి తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తుల సమక్షంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed