ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సర్వేను వంద శాతం పూర్తి చేయాలి: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి
జమ్మికుంట ,వి90 న్యూస్ , మే 12: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఏరియాలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేయాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమ పురోగతిని సమీక్షించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2026-27 జనాభా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు స్వయంగా ఇంటింటికీ వెళ్లి సెన్సెస్ ఫారంలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రజల నుంచి సేకరించి నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ బృహత్తర కార్యం విజయవంతం కావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా ఈ గణన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు టిపివో శ్రీధర్, టిపిబివో దీపిక , పలువురు ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
