కరీంనగర్ · May 16, 2026

జమ్మికుంటలో తెలంగాణ ఉద్యమకారుల సంబరాలు: అమరవీరుల స్థూపానికి నివాళులు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్, మే 16:తెలంగాణ ఉద్యమకారుల కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) సెక్రెటరీ జనరల్ ఎక్కేటి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీని వేస్తూ 679 జీవోను జారీ చేసినందుకు గాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, చైర్మన్ కె. కేశవరావు, ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్సీ విప్ దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిల చిత్రపటాలకు ఉద్యమకారులు ఘనంగా పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎక్కేటి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి 679 జీవోను తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా చేసిన పోరాటాల ఫలితమే ఈరోజు ఈ కమిటీ రూపంలో సాకారమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో టౌన్ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య, నియోజకవర్గ కన్వీనర్ ఆరె రమేష్ రెడ్డి, జమ్మికుంట మండల పట్టణ ఉపాధ్యక్షుడు రామ్ రాజబాబు, జమ్మికుంట ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమి రెడ్డి, మోతే స్వామి, రచ్చ గణేష్, బిట్ల రమేష్, కొంగరి రవీందర్, పెరమాళ్ల సుదర్శన్ గౌడ్, ఏబూసి ఓదెలు, ఒజ్జా తిరుపతి, బండారి సమ్మయ్య, బిట్ల శ్రీనివాసు, ఇమ్మడి రాజు, రేణిగుంట రజిని కుమార్, పుట్టరాజు తదితర ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor