కరీంనగర్ · May 22, 2026

బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యునిగా రాజేష్ ఠాకూర్ నియామకం: పార్టీ అగ్రనాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్, మే 22: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన రాజేష్ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర , జిల్లా అగ్రనాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు.

అలాగే రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కిరణ్ కి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంపై రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ, అగ్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి, ఎస్సీ సామాజికవర్గ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor