కరీంనగర్ · May 23, 2026

జమ్మికుంట కాంగ్రెస్ పార్టీలో మానవత్వం: ప్రమాదంలో మరణించిన సలీం పాషా కుటుంబానికి వొడితల ప్రణవ్ రూ. 50 వేల ఆర్థిక సాయం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 23: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావించే ఆయన, విపత్కర పరిస్థితుల్లో కార్యకర్తల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన జమ్మికుంటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త మహమ్మద్ సలీం పాషా కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన తక్షణమే స్పందించారు.శనివారం నాడు సలీం పాషా నివాసానికి వెళ్లిన జమ్మికుంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వొడితల ప్రణవ్ పంపించిన యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కష్ట సమయంలో ఆర్థిక సాయం అందడంతో సలీం పాషా కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నాయకులు వారిని ఓదార్చి, పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం శ్రమించిన సలీం పాషా మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపే పెద్ద దిక్కు వొడితల ప్రణవ్ బాబు అని, ఈరోజు సలీం కుటుంబానికి అండగా నిలిచి ఆయన మరోసారి తన ఉదారత్వాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునే విషయంలో ప్రణవ్ బాబు ఎప్పుడూ ముందే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor