క్రైమ్ · May 29, 2026

జనగామ జిల్లాలో భారీ దొంగతనం: వృద్ధురాలి మెడలో 5 తులాల బంగారం అపహరణ, బైక్ వదిలేసి పారిపోయిన దొంగ!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జనగామ ,వి90 న్యూస్,మే 29: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ప్రజలు ఇళ్ల బయట నిద్రిస్తున్న తరుణాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని దొంగ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. గ్రామానికి చెందిన కప్పరి యాదమ్మ అనే వృద్ధురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా, ఆమెపై పడ్డ దొంగ మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసుతో పాటు కొంత నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.అయితే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, పట్టుబడతానేమోననే కంగారులో దొంగ తను వచ్చిన మోటార్ సైకిల్‌ను, చెప్పులను ఘటనా స్థలంలోనే వదిలిపెట్టి కాలినడకన పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దొంగ వదిలివెళ్లిన బైక్ నెంబర్, ఇతర ఆధారాల సహాయంతో క్లూస్ సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor