జాతీయం · July 28, 2026

మైనర్లు, నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఢిల్లీ,వి90 న్యూస్,జూలై 28: పరీక్ష పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్లు, ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తాత్కాలిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నీట్ పరీక్ష అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, దౌర్జన్యాలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును గుర్తుచేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై స్పందిస్తూ… నిర్దోషులపై దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ఊరుకోదని హెచ్చరించింది. బాధ్యులను తేల్చనప్పుడు విచారణకే అర్థం ఉండదని, అందుకే ఈ ఘటనలపై స్వతంత్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. శాంతియుతంగా న్యాయం కోరుతున్న విద్యార్థులపై బలప్రయోగానికి దిగడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసిన న్యాయస్థానం, ఇదే సమయంలో గాయపడిన పోలీసుల రక్షణ, వారి భద్రతా పరికరాల అంశంపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా నిరసనలను అదుపు చేసేందుకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రీతిలో కాకుండా ఒకే విధమైన ఏకీకృత ప్రొటోకాల్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor