జనగామ · June 9, 2026

పల్లగుట్టలో రూ.60.62 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం: పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జనగాం/స్టేషన్ ఘనపూర్,వి90 న్యూస్, జూన్ 09: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఒక 132/33 కేవీ, ఆరు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల శంకుస్థాపన , ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి హాజరై సబ్‌స్టేషన్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సబ్‌స్టేషన్ల ద్వారా ప్రాంతంలో విద్యుత్ సరఫరా లోపాలు తొలగిపోయి, మరింత మెరుగుపడుతుందని, తద్వారా స్థానిక రైతులు, ప్రజలకు నాణ్యమైన కరెంట్ సేవలు అందుతాయని వారు పేర్కొన్నారు. ఈ రికార్డు స్థాయి అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజులతో పాటు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, కోఆపరేటివ్ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor