దాస్యం కమలమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 09: జమ్మికుంట పట్టణ కేంద్రంలోని 12వ వార్డు పద్మశాలి వీధిలో నివాసముంటున్న దాస్యం కమలమ్మ ఇటీవల మరణించగా, ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన దశదినకర్మ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమలమ్మ మృతితో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను చైర్మన్ దిలీప్ వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. కమలమ్మ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు స్థానిక వార్డు కౌన్సిలర్, పట్టణ ప్రముఖులు, వార్డు ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కమలమ్మకు అంజలి ఘటించారు.

