జగ్గయ్యపల్లి బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

0
1005818898

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 18: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు విచ్చేసిన చైర్మన్‌కు గ్రామ సర్పంచ్ వీరన్న మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలను, అమ్మవార్లను కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో పూజించడం మన సాంప్రదాయమని కొనియాడారు.శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, నాభిశిల అమ్మవార్ల ఆశీస్సులతో జగ్గయ్యపల్లి గ్రామ ప్రజలతో పాటు, జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మంద రాజేష్, శంకర్, మాజీ సర్పంచ్ వంశీధర్, అనిల్, శ్రీనివాస్, వినయ్ తదితరులతో పాటు గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed