తెలంగాణ · June 18, 2026

కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జ్యోషి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి,వి90 న్యూస్,జూన్ 18: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జ్యోషి గురువారం కేశంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయన, ముందుగా వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల అత్యంత మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే త్వరితగతిన స్పందించాలని స్పష్టం చేశారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మహిళలు, పిల్లల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామస్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ ఉన్నత స్థాయి తనిఖీ కార్యక్రమంలో సంబంధిత డీసీపీ, ఏసీపీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor