కరీంనగర్ · June 19, 2026

హుజురాబాద్ విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన నిఘా: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 18: హుజురాబాద్ పట్టణంలోని విద్యాసంస్థల చుట్టుపక్కల పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై అధికారులు నిఘా తీవ్రం చేశారు. పాఠశాలలు, కాలేజీల సమీపంలో గుట్కా, పాన్, సిగరెట్లు వంటి హానికరమైన పొగాకు పదార్థాలను విక్రయించడం భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పరిరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిరోధక (COTPA) చట్టం 2003 లోని సెక్షన్ 6 ప్రకారం, ఏదేని విద్యాసంస్థకు వంద మీటర్ల పరిధిలోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ధిక్కరించి ఎవరైనా విక్రయాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తమ పరిసరాల్లోని విద్యాసంస్థల వద్ద ఇలాంటి అక్రమ విక్రయాలను గమనిస్తే వెంటనే స్పందించాలని అధికారులు కోరుతున్నారు. ఈ విధమైన ఉల్లంఘనలపై స్థానిక పోలీసు స్టేషన్‌లో గానీ లేదా మున్సిపల్ అధికారులకు గానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రజల నుంచి అందే సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor