కరీంనగర్ · June 19, 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగిసిన ‘కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్’ శిక్షణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అన్న అక్క మెంటార్షిప్ టీచింగ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం’లో భాగంగా నోడల్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అధునాతన సాంకేతిక ప్రపంచానికి సంసిద్ధం చేయడమే లక్ష్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ లెర్నింగ్ అంశాలపై ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ డా. ఎస్. ఓదెలు కుమార్ మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధస్సు పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శిక్షణ అందించిన పి. అవనికేత్ ని కళాశాల బృందం ఘనంగా సత్కరించింది. ఈ ముగింపు వేడుకలో మెంటార్ మెంటి ఇంఛార్ట్ డా. ఎం.శామల, అకడమిక్ కో-ఆర్డినేటర్ డా. రాజేంద్రం, డా.సి. రాజకుమార్, నోడల్ ఆఫీసర్స్ వి. కిరణ్ కుమార్, ఎల్. రవీందర్, డా. ఎన్. శ్రీనివాస్, అలాగే అధ్యాపకులు కె. ఉమాకిరణ్, డా.కె. మాధవి, పి.శ్రీనివాస్ రెడ్డి, ఎన్. మమత, డా. పి. సుష్మ, డా.పి. రవిప్రకాశ్ రావు, ప్రశాంత్, రమేష్, సాయికుమార్, అనూష, అరుణ్ రాజ్, డా. పి. స్వప్న, దీనా , పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor