కరీంనగర్ · June 19, 2026

ప్రశ్నించే యువశక్తే దేశానికి బలం: రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ జమ్మికుంట పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ పరిరక్షకుడు, ప్రజా నాయకుడైన రాహుల్ గాంధీకి నియోజకవర్గ యువత పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న నిరంతర పోరాటం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగిన ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా దేశంలో ఐక్యత, సామరస్యం, ప్రేమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు ఆయనేనని ప్రశంసించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలపై పార్లమెంటుతో పాటు ప్రజాక్షేత్రంలోనూ రాహుల్ గాంధీ గళమెత్తుతూ యువత, రైతులు, మహిళల ఆకాంక్షలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. దేశ సమగ్రతను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్న ఆయనను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వార్డు, గ్రామస్థాయిల్లో సైనికుడిలా పని చేయాలని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.ఈ సంక్షేమ మరియు సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి సదయ్య, పార్టీ ప్రచార కమిటీ సభ్యులు సాయిని రవి, జమ్మికుంట మండల అధ్యక్షులు వీరమనేని పరుశురాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, దొడ్డే సంధ్య, కార్యదర్శి సజ్జు, హుజురాబాద్ ప్రధాన కార్యదర్శి రోమాల రాజ్ కుమార్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్ లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ , యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor