తెలంగాణ · June 19, 2026

వీణవంకలో ఘనంగా రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూన్ 19: వీణవంక మండల కేంద్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని, ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్, గంగాడి తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ, దేశంలో ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ చారిత్రాత్మకమైనదని కొనియాడారు. ఈ పాదయాత్ర ద్వారా దేశ ప్రజల హృదయాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జవజీవాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు గంగాడి రాజిరెడ్డి, ప్రముఖ నాయకులు మోటం శ్రీనివాస్, గంగాడి తిరుపతి రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, అందె కుమార్, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, మసాడి చొక్కా రావు పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచ్‌లు చిన్నాల ఐలయ్య, కర్ర తిరుపతి రెడ్డి, మ్యాక వీరయ్య, పుదరి మధునయ్య, పానుగంటి మధుకర్, జిల్లా కార్యదర్శులు వావినీల సత్యనారాయణ, కంకణాల జగదీశ్వర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్, నల్లగోని సతీష్, నాయకులు అలె మధుసూదన్, ఎల్కపల్లి లక్ష్మన్, మడ్డి అనిల్, అడిగోప్పల సంపత్, చేపూరి రాజు, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మ్యాడగొని శ్రీనివాస్, ఆవాల రామకృష్ణ, గాజుల శ్రీనివాస్, బొంగోని రాజయ్యతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor