కరీంనగర్ · June 19, 2026

చేనేత సంఘం నూతన పాలకవర్గానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ శుభాకాంక్షలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం, వారి సర్వతోముఖాభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సంఘం మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి , కార్మికుల పురోగతికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ భరోసా ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గ సభ్యులు చేనేత కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షులు ఉడుత రమేష్, సభ్యులు రాజేందర్, దామోదర్, రాజమౌళి, శ్రీను, సంధ్య, సరోజన, మల్లయ్య, శివతో పాటు చేనేత కార్మికులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor