కరీంనగర్ · June 19, 2026

కేంద్ర పథకాల అమలు కోసం ప్రతి బిజెపి కార్యకర్త శ్రమించాలి: ఆకుల రాజేందర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట పట్టణంలో బిజెపి ఓబీసీ మోర్చా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండల కన్వీనర్ల సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిపాలన జిల్లా కన్వీనర్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ దైవ స్వరూపుడిగా మారి దేశాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ప్రజా సంక్షేమ పథకం గ్రామంలోని చిట్టచివరి లబ్ధిదారుడికి చేరేవరకు ఓబీసీ మోర్చా కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పంపిణీలో కార్యకర్తల కృషியே దిక్సూచి కావాలని, అప్పుడే ప్రజల్లో బిజెపి పార్టీపై నమ్మకం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో గ్రామ గ్రామాన కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు.ఈ సమీక్షా కార్యక్రమంలో హుజురాబాద్ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఇంగిలి ప్రభాకర్, మండల ప్రబారీలు శ్రీపర్తి ప్రవీణ్, ఉప్పు దుర్గయ్య, చంద్రమౌళి, మల్లేష్‌లతో పాటు బిజెపి ముఖ్య నాయకులు పొట్లాల మల్లేష్, ఆవుల తిరుపతి, సిరియాల విజయ్, సుమన్ , ఓబీసీ మోర్చా మండల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor