జమ్మికుంట బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు: పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

0
1005934546

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన రీతిలో వర్షాలు కురవకపోవడంతో, సకాలంలో వానలు పడాలని ఆకాంక్షిస్తూ జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ సేవాసమితితో పాటు మరికొన్ని సేవాసమితుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పరమశివుడి అభిషేక మహోత్సవంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ )ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, శివస్వాములు ఆలయంలో భజనలు, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, మానవాళికి ఏ కష్టం వచ్చినా మొదటగా మొరపెట్టుకునేది ఆ పరమశివుడికేనని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వామివారి అనుగ్రహం కోసం ఈ అభిషేకాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బోళాశంకరుడి దయతో జమ్మికుంట పట్టణ పరిధిలోనే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలు , యావత్ తెలంగాణ వ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందా రాజు, ప్రముఖులు లెంకలపల్లి శరత్, యాంసాని సురేష్, రవీందర్ రెడ్డి, రఘు, చంద్రమౌళి, శ్రీనివాస్, రాజన్న, శివశంకర్, ఆలయ అర్చకులు, సేవాసమితుల ప్రతినిధులు , పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed