కరీంనగర్ · July 1, 2026

ఆకుల రాజేందర్ కు మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ఘన సన్మానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జులై 01: జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు ఆకుల రాజేందర్ ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో ఆయనకు స్థానికంగా ఘన సన్మానం జరిగింది. బుధవారం మండల కేంద్రంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజేందర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, మున్నూరు కాపు సంక్షేమ సంఘం జమ్మికుంట అర్బన్ అధ్యక్షులు ఏ. బుషి శ్రీనివాస్, జిల్లా నాయకులు దాట్ల శ్రీనివాస్, ఏ. బూసి సంపత్, కొలకాని రాజేందర్, పంతాటి రవీందర్ తదితరులు పాల్గొని రాజేందర్ కు అభినందనలు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor