కరీంనగర్ · July 12, 2026

అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య మహాసభ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా… పట్టణ అధ్యక్షుడు లెంకలపల్లి శరత్ కుమార్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 12: జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య మహాసభ, మహిళా, యువజన సంఘాల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలో నూతన బాధ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా లెంకలపల్లి శరత్ కుమార్ చేత జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా దొడ్డ సునీత, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా గౌరీశెట్టి వైష్ణవ్ లతో పాటు, ఆయా విభాగాల నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్(దిలీప్) హాజరై నూతన కమిటీలకు తన అభినందనలు తెలిపారు.


ప్రమాణ స్వీకారం అనంతరం పట్టణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు లెంకలపల్లి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు. ఆర్యవైశ్య కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా తాము ముందుండి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, నిరుపేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక కృషి చేస్తామని, నిరుపేద యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమాజంలోని నిరుపేద ఆర్యవైశ్యులు ఎవరైనా మరణిస్తే, వారి దహన సంస్కారాల ఖర్చులను ఆర్యవైశ్య సంఘమే భరిస్తుందని ఈ సందర్భంగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు.


ఈ మహోత్సవంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి తొడుపునూరి వెంకటేశం, కోశాధికారి పడకంటి శ్రీనివాస్, జిల్లా బాధ్యులు అయితా సుధాకర్, ఆకినపల్లి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బచ్చు భాస్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త బచ్చు వీర్లింగం, ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, ప్రముఖ వ్యాపారి ముక్క శివకుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చందా రాజు, ఆవోప జమ్మికుంట అధ్యక్షులు ఆకినపల్లి శ్రీనివాస్, వాసవి క్లబ్ జమ్మికుంట అధ్యక్షులు జి.వి. సతీష్, మండల ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కొండ్లె పాపయ్య, ఐతా విజయకుమార్, ఎన్నికల కన్వీనర్ బాదం రమేష్ బాబు, కో-కన్వీనర్ రాఘవేందర్, ప్రముఖ వ్యాపారులు అయిత యుగంధర్, జడల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు లెంకలపల్లి శంకరయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు పట్టణ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor