ఆంధ్ర ప్రదేశ్ · August 1, 2026

ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త రెక్కలు.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

భోగాపురం,వి90 న్యూస్,ఆగస్టు 01: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరొక కొత్త అధ్యాయం ఆరంభమైంది. ప్రతిష్టాత్మక అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన శుభసమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు, నాయకులకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఇక్కడి ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయని, ఈ ప్రాజెక్టును సఫలీకృతం చేసినందుకు ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానికి గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా, ఇదే వేదికపై గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళలను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ఈ ప్రాజెక్టుకు మొదట్లో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం నుండి, నేడు సమర్థవంతంగా పూర్తి చేసి ప్రారంభోత్సవం (గుమ్మడికాయ కట్టడం) వరకు అంకితభావంతో పనిచేయడం తీరని తృప్తిని ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ రాకతో కేవలం విమానాల రాకపోకలే కాకుండా, కొత్త ఆర్థిక అవకాశాలు, విదేశీ పెట్టుబడులు విశేషంగా తరలివచ్చే అవకాశం ఉంది. పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగవంతంగా విస్తరించి ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా సరికొత్త ఎత్తులకు ఎదుగుతుందని భావిస్తున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ సాకారంతో రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఇక ‘ఉత్తమాంధ్ర’, ‘ఉన్నతాంధ్ర’గా భాసిల్లుతుందని స్పష్టమవుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని, ప్రధాని పాల్గొన్న ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు, అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor