శ్రీశైల మల్లన్నకు కాసుల వర్షం: 33 రోజుల్లో రూ. 4.83 కోట్ల ఆదాయం

0
WhatsApp Image 2026-04-23 at 21.03.44 (1)

శ్రీశైలం, ఏప్రిల్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. గత 33 రోజులకు సంబంధించి దేవస్థాన పరిధిలోని హుండీలను గురువారం పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. ఈ లెక్కింపు ద్వారా ఆలయానికి భారీగా నగదు, బంగారం, వెండి మరియు విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు వెల్లడించారు.

లెక్కింపు వివరాలు:
గత నెల మార్చి 21 నుండి ఏప్రిల్ 22 వరకు (33 రోజులు) భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా..

  • నగదు: రూ. 4,83,22,554/- (నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు).
  • బంగారం: 162 గ్రాముల 200 మిల్లీగ్రాములు.
  • వెండి: 4 కేజీల 180 గ్రాములు.

విదేశీ కరెన్సీ సందడి:
భారతీయ కరెన్సీతో పాటు వివిధ దేశాల కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేశారు. ఇందులో ముఖ్యంగా:

  • 144 – యుఎస్ఏ డాలర్లు
  • 9870 – శ్రీలంక రూపాయిలు
  • 151 – మలేషియా రింగిట్స్
  • 120 – సౌదీ రియాల్స్
  • 90 – యు.ఎ.ఇ దిర్హమ్స్
  • ఇతర దేశాలైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, న్యూజిలాండ్ మరియు యూరోపియన్ దేశాల కరెన్సీ కూడా లభించాయి.


ఈ హుండీ లెక్కింపు ప్రక్రియను దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO) శ్రీ యం. శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు. పారదర్శకత కోసం మొత్తం లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించారు.


About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed