జాతీయం · August 21, 2026

దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత: సినీ లోకంలో తీవ్ర విషాదం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

చెన్నై,వి90 న్యూస్,ఆగస్టు 21: తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి, పద్మశ్రీ ‘షావుకారు’ జానకి (94) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ఆమె, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 1950లో ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, ఆ సినిమా అద్భుత విజయంతో తన పేరును ‘షావుకారు జానకి’గా మార్చుకున్నారు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 400కు పైగా చిత్రాల్లో నటించి, కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor