సినిమా · August 25, 2026

జయరామ్ – సిమ్రాన్ రహస్య వివాహం? సోషల్ మీడియా పుకార్లపై అసలు నిజం ఇదే!

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వి90 న్యూస్ డెస్క్ ,ఆగస్టు 25: సినీ నటులు జయరామ్, సిమ్రాన్ సాంప్రదాయ దుస్తుల్లో మెడలో పూలదండలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ వైట్ పంచెకట్టులో జయరామ్, ఎర్రటి పట్టుచీరలో సిమ్రాన్ కనిపించడంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ నెటిజన్లు పుకార్లు సృష్టించారు. కొందరైతే ఏకంగా వారికి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వ్యక్తిగత విషయాలపై రూమర్లు వ్యాప్తి చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. వీరిద్దరూ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఒక నూతన సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన జయరామ్, సిమ్రాన్‌లను చిత్ర నిర్మాణ సంస్థ సాంప్రదాయబద్ధంగా పూలదండలు వేసి గౌరవంగా సత్కరించింది. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలనే కొందరు అల్లరిమూకలు సోషల్ మీడియాలో రహస్య వివాహం అంటూ తప్పుగా ప్రచారం చేశారు.సినిమా ఓపెనింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను పెళ్లి ఫోటోలుగా మార్చి రూమర్లు పుట్టించారని తెలియడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నటీనటుల పర్సనల్ లైఫ్‌పై ఇలాంటి చిల్లర ప్రచారాలు చేయడంపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor