‘ది అనంతపురం నైట్’ చిత్ర పోస్టర్లను విడుదల చేసిన మంత్రి సవితమ్మ

0
IMG-20260523-WA0043

శ్రీ సత్యసాయి జిల్లా, వి90 న్యూస్, మే 23: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ‘ది అనంతపురం నైట్’ సినిమా పోస్టర్ల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన జి.ఎం. సురేష్ నిర్మించిన ఈ చిత్ర పోస్టర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్న మంత్రి చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం సంతోషకరమని పేర్కొంటూ, చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆమె తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed