కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 03: జమ్మికుంట పట్టణ పరిధిలోని 23వ వార్డులో గల శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మందిర ప్రాంగణంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్వామివారికి మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌన్సిలర్లు చందా రాజు, కూతటి తిరుపతి, జుగురూ సదానందం, మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డిలతో పాటు పలువురు స్థానిక నాయకులు, భక్తులు పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్, ఆ భగవంతుని ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

