కరీంనగర్ · September 4, 2026

హుజూరాబాద్, జమ్మికుంటల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు: ముఖ్య అతిథిగా పాల్గొన్న వొడితల ప్రణవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 04: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు, యాదవ కుల సోదరులు ఘన స్వాగతం పలికారు.

అక్కడ కొబ్బరికాయ కొట్టి ఉట్టి వేడుకలను ప్రణవ్ అధికారికంగా ప్రారంభించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.అనంతరం హుజూరాబాద్ పట్టణంలోని 12వ వార్డు (ముక్కపల్లి)తో పాటు హుజూరాబాద్ మండల పరిధిలోని సింగాపూర్ గ్రామంలో జరిగిన ఉట్టి కొట్టే సంబరాల్లో కూడా వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. అక్కడ ఉన్న పిల్లలతో సరదాగా గడుపుతూ, ఉట్టి కొట్టే పోటీల్లో పాల్గొన్న యువతను, చిన్నారులను ఉత్సాహపరిచారు. ఈ వేడుకల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, జమ్మికుంట నాయకుడు అబ్బరవేన రాజు యాదవ్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, యాదవ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor