కరీంనగర్ · September 5, 2026

జమ్మికుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు: కన్నులపండువగా ఊంజల్ సేవ, ఉట్టీ ఉత్సవం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 05: జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను గోవింద నామస్మరణలు, ఆధ్యాత్మిక చైతన్యం నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా దర్శనీయంగా అలంకరించారు.ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం అర్చకులు, భక్తుల సమక్షంలో స్వామివారి ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు.

వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉట్టీ కొట్టే కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తాతో పాటు పి.శ్రీనివాస్, బచ్చు వీరలింగం, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రావు , పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor