కరీంనగర్ · September 11, 2026

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలి: విత్తన విగ్రహాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 11: జమ్మికుంట పట్టణ పరిధిలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న విఘ్నేశ్వరుని విత్తన మట్టి విగ్రహాలను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం విత్తన మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో విత్తన గణపతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. మట్టి విగ్రహాలనే పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor