తెలంగాణ · September 14, 2026

సకుటుంబంగా గణనాథుని పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా గణపతి పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని, తొలిపూజలందుకునే విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు సమర్పించారు. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వినాయక చవితి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బొజ్జ గణపయ్య దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఉన్న సకల విఘ్నాలు, కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలోనూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని శ్రీ సిద్ధి వినాయకుని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పూనుకున్న ప్రతి సంకల్పం దిగ్విజయంగా పూర్తవ్వాలని, తెలంగాణ ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో, సిరిసంపదలతో తులతూగాలని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor