కరీంనగర్ · September 17, 2026

జమ్మికుంటలో వైభవంగా గణేశ్ నవరాత్రి మహా అన్నదానం: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 17: జమ్మికుంట పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి మండపం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు పూర్తి చేసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు లేంకలపల్లి శరత్ కుమార్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. సిద్ధి బుద్ధి ప్రదాత అయిన లంబోదరుని దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ మహా అన్నదానంలో ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో విజయవంతం చేసిన భక్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor