జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున స్వామి
జమ్మికుంట మే 2:పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్‌గా గుట్టల మల్లికార్జున స్వామి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఆయన జమ్మికుంటకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణ సమగ్ర అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, జె.ఏ.ఓ రాజశేఖర్ రెడ్డి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, టిపిబివో దీపిక, శానిటరీ ఇనస్పెక్టర్ మహేష్, ఆర్ ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వాణి, శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు.
