కరీంనగర్ · May 2, 2026

జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఘనంగా వీడ్కోలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట మే 2 : జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ బదిలీ కావడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. గత రెండు సంవత్సరాలుగా జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. మహమ్మద్ అయాజ్ తన పదవీ కాలంలో పట్టణాన్ని అన్ని రంగాలలో ముందుంచి, జమ్మికుంట పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారని వారు ప్రశంసించారు. ముఖ్యంగా పట్టణంలో ఇంటి పన్ను వసూళ్ల విషయంలో వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిపి తన పనితీరును చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఈ వీడ్కోలు సమావేశంలో మున్సిపల్ అధికారులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, జె.ఏ.వో. రాజశేఖర్ రెడ్డి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, ఆర్.ఐ. భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వాణి, శ్రీనివాస్ , ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor