కరీంనగర్ · May 6, 2026

రైతులకు అండగా ఉంటాం.. కంటతడి పెట్టిన బాధితులకు వొడితల ప్రణవ్ భరోసా

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట మే 06 : జమ్మికుంట మండలం వావిలాల నుండి వంతడుపుల వెళ్ళే రహదారిలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడతల ప్రణవ్ బుధవారం నాడు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన తీరును, ప్రమాదానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తమ కష్టాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైన రైతులను ప్రణవ్ బాబు ఓదార్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతేనని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వరమే సాయం అందేలా చూడాలని ఆదేశించామన్నారు. త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. ఈ కార్యక్రమంలో వావిలాల గ్రామ సర్పంచ్ అర్జున్, తనుగుల గ్రామ సర్పంచ్ కిరణ్, మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు మెలుగురీ సదయ్యతో పాటు మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor