కరీంనగర్ · May 8, 2026

జమ్మికుంటలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు: శివాలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,V90 NEWS, మే 08 : రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 58వ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో మంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశిని కోటి మరియు సుంకర రమేష్ మాట్లాడుతూ నాడు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఆంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రేతో దాడి చేసినా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించి బీసీల పక్షపాతిగా నిలిచారని వారు పేర్కొన్నారు. బీసీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు సీట్ల కేటాయింపులో న్యాయం జరగాలని నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. జమ్మికుంట అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆదర్శ రైల్వే స్టేషన్, ఎస్టీఓ ఆఫీసు వంటి కీలక సౌకర్యాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో ములుగురి సదయ్య, సతీష్ రెడ్డి, సాయిని రవి, పూదరి రేణుక, శివ, భాగ్యలక్ష్మి, ఎండి సలీం, పంజాల అజయ్, కౌన్సిలర్లు దిడ్డి రాము, చందా రాజు, మాచర్ల రాజు, ఒగ్గు రమేష్, ఇంగిత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వరరావు, సూర్య, మాజీ కౌన్సిలర్లు బొంగుని వీరన్న, రవి, కంటి రాజు, పిట్టల రమేష్, మాజీ దేవస్థాన డైరెక్టర్ రామ్ రెడ్డి, దుబ్బ మల్లన్న కమిటీ చైర్మన్ ముద్దమల రవి, చిన్నింటి నాగేందర్, రాకేష్, ప్రసాద్ రాజు, ఖలీల్, సునీల్, శివకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, ప్రవీణ్, సింగిరెడ్డి రంజిత్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor