డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకలగా కలిసిన సబ్బని వెంకట్: కీలక అంశాలపై చర్చ

0
IMG-20260509-WA0013

హైదరాబాద్ ,వి90న్యూస్, మే 09: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ను సబ్బని వెంకట్ మర్యాదపూర్వకలగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో వారిద్దరి మధ్య పలు ఆసక్తికరమైన, కీలకమైన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యంగా 2013-14 కాలంలో సీవీ ఆనంద్ సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో, మహిళల రక్షణ కోసం ప్రతిష్టాత్మకమైన షీ టీమ్స్ (She Teams) ఏర్పాటు చేసిన సందర్భాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం అమలు చేయాల్సిన సాంకేతిక అంశాలపై వెంకట్ అందించిన సూచనలు, ఆనంద్ వాటిని అమలు చేసిన విధానంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి.కేవలం పాత జ్ఞాపకాలకే పరిమితం కాకుండా, ప్రస్తుత పరిస్థితులపై కూడా వారు దృష్టి సారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లాలోని పలు తాజా పరిణామాలు, సామాజిక అంశాల గురించి డీజీపీతో వెంకట్ చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ ఇరు వర్గాల మధ్య ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేయడమే కాకుండా, ప్రజా ప్రయోజనార్థం సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై ఫలప్రదంగా సాగింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed