ఆంధ్ర ప్రదేశ్ · May 11, 2026

ప్రజా సంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న కూటమి ప్రభుత్వం: వైవీబీ రాజేంద్ర ప్రసాద్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఉయ్యూరు, వి90 న్యూస్, మే 11: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, చెప్పిన మాటను చేతల్లో నిరూపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉయ్యూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన సుమారు 9 లక్షల 60 వేల రూపాయల విలువైన చెక్కులను 16 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు.అదేవిధంగా, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు కుమార్తె వివాహ వేడుకకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంపాన పూల, జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, పల్యాల శ్రీను, బూరెల నరేష్, పరిమి సలోమి, కార్తీక్, కుటుంబరావు, ఆసిఫ్, చిరంజీవి, తిరుపతిరావు, చింతయ్య, కొలగాని సాంబశివరావు, గఫూర్, రషీద్, బాషి, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor