రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

0
IMG-20260511-WA0040

ఎల్కతుర్తి, వి90 న్యూస్, మే 11: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ తంగెడ శాలిని భర్త, మాజీ మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్‌తో పాటు, మాజీ సర్పంచ్ మాధవి భర్త గొల్లె మహేందర్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరు ప్రస్తుతం హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సోమవారం ఆసుపత్రికి వెళ్లిన సతీష్ కుమార్ బాధితులను పలకరించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ పరామర్శలో సతీష్ కుమార్ వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిట్టల మహేందర్, సురేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed