కరీంనగర్ · May 11, 2026

బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలి: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 11: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు నమోదైన పోక్సో (POCSO) కేసు విషయంలో కేంద్ర మంత్రి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఎప్పుడూ నీతులు మాట్లాడే బండి సంజయ్, తన కుమారుడిని కాపాడుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారని, ఈ క్రమంలో బాధితురాలైన మైనర్ బాలికకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మహిళా సమాజాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని, సమాజానికి ఆయన ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశాంత్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి, పోక్సో కేసులో నిందితులకు చట్టప్రకారం పడే శిక్ష తన కుమారుడికి కూడా పడేలా సహకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు కోలుగురి సురేష్, పొనగంటి రాము, చింతల శ్రీనివాస్, PACS చైర్మన్ పొనగంటి సంపత్, నాయకులు మంద రాజేష్, పోల్సాని వేణుగోపాల్ రావు, భిక్షపతి, శివశంకర్, శివ, శ్రీనివాస్, రాము, సందీప్, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor