కరీంనగర్ · May 11, 2026

ఆరోపణలు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మద్దతు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్, వి90న్యూస్, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై ఇటీవల వస్తున్న ఆరోపణలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసానికి వెళ్లిన ఆయన, సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి మంత్రిని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు దర్యాప్తు పూర్తికాకముందే, కోర్టు తీర్పు వెలువడకముందే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమన్నారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కాదని, మన దేశంలోని బలమైన న్యాయ వ్యవస్థే నిజాన్ని నిర్ధారిస్తుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న బండి సంజయ్ వంటి ప్రజా నాయకుడిపై రాజకీయ కక్షలతో వ్యక్తిత్వ హననం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వానికి షాద్ నగర్ బీజేపీ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, దుష్ప్రచారాలు ఎన్ని చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అందరూ ఓపికగా ఉండాలని, కోర్టు తీర్పే తుది నిర్ణయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor