కరీంనగర్ · May 12, 2026

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట ,వి90 న్యూస్ ,మే 12 : పట్టణంలోని గణేష్ నగర్ సంజీవ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) ఆలయాన్ని దర్శించి, స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలతో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, బూరుగుపల్లి రాము, చరణ్, రావికంటి రాజ్ కుమార్, పిట్టల రమేష్, జక్కే రవీందర్, అఖిలేష్‌తో పాటు అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor