కరీంనగర్ · May 13, 2026

జమ్మికుంటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు జన్మదిన వేడుకలు: సేవా కార్యక్రమాలతో హోరెత్తిన పట్టణం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట ,వి90 న్యూస్, మే 13: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. సంపత్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు, అభిమానులు పట్టణంలోని ప్రముఖ శివాలయం (బొమ్మల గుడి)లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేయగా, భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడీ మల్లేష్ మాట్లాడుతూ సంపత్ రావు రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు. విద్యార్థి దశలోనే సామాజిక బాధ్యతతో ఏబీవీపీలో చేరి, విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడిన చరిత్ర సంపత్ రావుదని ఆయన గుర్తు చేశారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించిన అధిష్టానం, గతంలో ఆయనకు మండల బీజేవైఎం అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిందని, వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు.బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా యువతలో జాతీయ భావజాలాన్ని పెంపొందించడమే కాకుండా, జిల్లా కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని మల్లేష్ పేర్కొన్నారు. సంపత్ రావు ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లపు రవి, కొమ్మ అశోక్, మేక సుధాకర్ రెడ్డి, కొండ్లె నాగేష్, తూడి రవిచంద్ర రెడ్డి, ఉడుగల మహేందర్, కొండపర్తి ప్రవీణ్, పోడేటి అనిల్, మురికి మహేష్, యాంసాని సమ్మయ్య, అప్పల రవీందర్, ఎర్ర వెంకటేష్, బొజ్జ శరత్, లకిడి రాజు, గడ్డం శ్రీ వర్ధన్, పల్లబోయిన పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొని సంపత్ రావుకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor