కరీంనగర్ · May 13, 2026

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట, వి90 న్యూస్, మే 13: జమ్మికుంట పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఏర్పాటు చేసుకున్న నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణం 23వ వార్డులోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపాన, పద్మశాలి భవనం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జమ్మికుంట ఆస్థాన వేదపండితులు మండలేముల కపర్ధి శర్మ వేద మంత్రోచ్ఛారణల నడుమ చైర్మన్‌కు ఆశీర్వచనం అందజేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు కోలుగురి సురేష్, పొనగంటి రాము, చుంచు రమాదేవి, మైస రవి, ఒగ్గు రమేష్, బండ శ్రీనివాస్, PACS చైర్మన్ పోనగంటి సంపత్, శ్రీనివాస్ , ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor