మంద సమ్మయ్య దంపతుల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , చైర్మన్ ప్రశాంత్ కుమార్
జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 13 : పట్టణంలోని 12వ వార్డులో మంద సమ్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి , జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన గృహంలో అడుగుపెట్టిన సమ్మయ్య దంపతులకు వారు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరడం సంతోషదాయకమని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ శ్రీనివాస్, బూరుగుపల్లి రాము, శివతో పాటు స్థానిక ప్రజలు , ఇతర ముఖ్యులు పాల్గొని సందడి చేశారు.
