కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై దుష్ప్రచారం.. నిరసనగా రంగంలోకి దిగిన జమ్మికుంట బీజేపీ నేతలు

0
IMG-20260514-WA0028

జమ్మికుంట ,వి90 న్యూస్ మే 14 : జమ్మికుంట పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.నిన్న బండి భగీరథ న్యాయస్థానానికి హాజరైనప్పటికీ, అతను హాజరుకాలేదంటూ తప్పుడు సమాచారంతో బండి సంజయ్ ఫోటోలను కలిపి పట్టణంలో వాల్ పోస్టర్లు అంటించడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ నాయకత్వంలో పట్టణవ్యాప్తంగా తిరుగుతూ ఆ తప్పుడు పోస్టర్లను చించివేసి నిరసన తెలిపారు.వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించే ప్రసక్తే లేదని, ఇలాంటి చిల్లర రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్‌తో పాటు దొంతరవీణ రమేష్ యాదవ్, సంపెల్లి సంపత్ రావు, కైలాసకోటి గణేష్, ఆవుల తిరుపతి, శ్రీపతి అఖిల్, అడవుల శ్రీధర్, రాయబారం సురేష్, పంజాల అనిల్, ఉడుగుల మహేందర్, సుంకర్ యాదయ్య , ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed